రాష్ట్రంలో ఎంతో మంది అభాగ్యుల ప్రాణాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ మేరకు బుధవారం చిలకలూరిపేటకు చెందిన తిరుమలయ్య, రాజేశ్వరి దంపతులకు సీఎం సహాయ నిధి నుంచి రూ. 4లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కూటమి ప్రభుత్వంలో స్వల్ప వ్యవధిలోనే బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మానవతా సాయం అందిస్తున్నారని తెలిపారు.