జర్నలిస్టులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం చిలకలూరిపేట కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. రాష్ట్ర నాయకత్వంతో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.