చిలకలూరిపేట పట్టణంలోని 31వ వార్డులో శనివారం కమిషనర్ హరిబాబు, జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేశ్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు అనేక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను త్వరగతిన పరిష్కరిస్తామని కమిషనర్ వార్డు ప్రజలకు తెలిపారు. వాటిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.