స్మార్టు మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సిపీఎం పల్నాడు జిల్లా కారుదర్శి వర్గ సభ్యులు యస్.ఆంజనేయులు నాయక్ పిలుపునిచ్చారు. గురువారం చిలకలూరిపేటలోని ఎన్.ఆర్.టి సెంటరులోని సిపిఐ కార్యాలయంలో జిల్లాస్థాయి విద్యుత్ సంస్కరణలపై సభ జరిగింది. నాయక్ మాట్లాడుతూ మీటర్లు పెట్టడం వల్ల మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. వివిధ పార్టీల జిల్లా నాయకులు పాల్గొన్నారు.