చిలకలూరిపేటలో నిరుద్యోగ యువత కోసం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని, 862మందికి ఉద్యోగాలు లభించాయని శనివారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈ జాబ్ మేళాకు మొత్తం 2,427 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. వారిలో 472 మంది నేరుగా ఎంపికయ్యారని, మరో 390 మందిని షార్ట్ లిస్ట్ చేశారన్నారు. మొత్తం మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో దాదాపు 30 శాతం మంది ఎంపికయ్యారని వివరించారు.