ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంగళవారం మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సచివాలయంలోనే సీఎంను కలసి నియోజకవర్గ అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు గురించి పలు వినతిపత్రాలు అందజేశారు. పెండింగ్ సమస్యల్లో ప్రాధాన్యంగా చేపట్టాల్సిన పనుల గురించి విన్నవించారు.