మే డే సందర్భంగా చిలకలూరిపేట
జనసేన పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోటరాజ రమేష్ పాల్గొని మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు, శ్రామికులు లేనిదే ప్రపంచ పురోగతి సాధించటం కష్టమని అన్నారు. ప్రభుత్వాలు వారి శ్రమను గుర్తించి వారికి అండగా నిలిచిన రోజునే మే డే అనే పదానికి విలువ ఉంటుందని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి శ్రామికుడి కష్టం వెనుక నిలుచున్న వ్యక్తి మరియు ఏకైక నాయకుడు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల కోసం, మత్స్యకారుల కోసం, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం, చేనేత కళాకారుల కోసం, పారిశుద్ధ కార్మికుల కోసం పోరాటాలు చేసి, వారికి ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. రాబోవు రోజుల్లో వారందరూ పవన్ కళ్యాణ్ వెంట నడిచి కార్మిక కర్షక, శ్రామిక ప్రభుత్వం ఏర్పడాలి అంటే
జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుభాని, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసన్, లీలా కిషోర్, అచ్చు కోల శేషు, కరిముల్లా, పసుపులేటి సాయి, వెంకటేష్ సూర్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.