యడ్లపాడు మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీభూసమేత రంగనాయక స్వామి ఆలయంలో సోమవార కళ్యాణోత్సవ కార్యక్రమం మొదలైంది. పర్చూరి రామకృష్ణమాచార్యులు నేతృత్వంలో స్వామి వారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణలు చేశారు. ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్ దంపతులు, అర్వపల్లి బ్రదర్స్ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలిరోజున విశ్వక్సేనపూజ, పుణ్యాహచనం, రక్షబంధనం, దీప, మండపారాధనలు, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణ, గరుడ ముద్దలు, తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. కార్యక్రమాలను ఈవో సీహెచ్ శివయ్య పర్యవేక్షించారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.