యడ్లపాడు ఎంఈఓ కార్యాలయం జలమయం

59చూసినవారు
పల్నాడు జిల్లాలో బుధవారం పలుచోట్ల కురిసిన వర్షం కారణంగా యడ్లపాడు మండలంలో ఎంఈఓ కార్యాలయం జలమయమైంది. సక్రమంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షం నీరు ఎంఈఓ కార్యాలయం ఆవరణలో భారీగా నిలిచింది. ప్రభుత్వ కార్యాలయంలోని పరిస్థితి ఇలా ఉండటంపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని కార్యాలయం సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్