చిలకలూరిపేట: సచివాలయ సిబ్బంది ప్రజలు అందుబాటులో ఉండాలి
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు సూచించారు. చిలకలూరిపేట పట్టణంలోని కుమ్మరి కాలనీ రెండవ సచివాలయాన్ని మంగళవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్ను పరిశీలించి సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు.