చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకులో బంగారం రుణాలు, ఫిక్సుడ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్ల నుంచి నగదు మాయం అయిందని గురువారం బాధితులు ఆరోపిస్తున్నారు. పాత మేనేజర్ నరేశ్, అప్రైజర్ హరీశ్ ఆధ్వర్యంలోనే ఈ గోల్మాల్ జరిగిందని బాధితులు అంటున్నారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు, బాధితులు భారీగా బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.