వేటపాలెం బైపాస్ రోడ్డులో ప్రమాదం

53చూసినవారు
వేటపాలెం బైపాస్ రోడ్డులో ప్రమాదం
వేటపాలెం బైపాస్ రోడ్డులో ఆదివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు వైపు వెళ్లే టిప్పర్ ను రోడ్డు మార్జిన్ లో నిలిపి ఉండగా వెనక నుండి వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ లో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్