తనపై వచ్చిన ఆరోపణలను ఖండించే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధులు, యజమానులు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ చీరాల డివిజన్ జర్నలిస్టులు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఆఫీసుకు చేరుకొని అక్కడ సభ నిర్వహించారు. పెద్దల సభ సభ్యుడైన విజయసాయిరెడ్డి ఇలా మాట్లాడటం తగదని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. టిడిపి, జనసేన, సిపిఐ నేతలు సంఘీభావం తెలిపారు.