చీరాలలో కొండయ్య నామినేషన్ కోలాహలం

4024చూసినవారు
చీరాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దలూరి మాలకొండయ్య ఎన్నికల నామినేషన్ ర్యాలీ గురువారం కోలాహలాంగా సాగింది. హస్తినాపురం నుండి ప్రారంభమైన ర్యాలీ సాల్మన్ సెంటర్, ముంతావారి సెంటర్ మీదుగా గడియార స్తంభం సెంటర్ కు చేరుకుంది. టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, యువ సినీ హీరో నిఖిల్ ర్యాలీ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టిడిపి, బిజెపి, జనసేన శ్రేణులతో పాటు భారీగా ప్రజలు తరలిరావడంతో ప్రధాన రహదారులు కిక్కిరిశాయి.

సంబంధిత పోస్ట్