వేటపాలెం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన మురికిపూడి అబ్రహం అనే తాపీ మేస్త్రి శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనపై ఆదివారం వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. అబ్రహం చీరాలలో పనికి వెళ్లి కడవకుదురు తిరిగి వస్తున్న క్రమంలో దిగమర్రు బైపాస్ లోని పందిళ్ళపల్లి క్రాస్ వద్ద బైక్ అదుపుతప్పి మృతి చెందాడు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.