చీరాల: పెళ్లి ఊరేగింపులో ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

85చూసినవారు
చీరాల: పెళ్లి ఊరేగింపులో ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
చీరాల వైకుంఠపురంలోని తూర్పు కాపుల వీధిలో ఆదివారం రాత్రి ఓ పెళ్లి ఊరేగింపులో యువకుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. పెళ్లి ఊరేగింపు ముగిసే సమయానికి యువకులు రెండు వర్గాలుగా చీలిపోయి ఇరు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ దాడిలో మణి(23), గౌతమ్(23) లకు గాయాలయ్యాయి. వారిని బందువులు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్