వేటపాలెం మండలం వేటపాలెం లోని ఓరుగంటి వీధి నందు మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ బుధవారం రాత్రి పలువురు మహిళలు ఆందోళన చేశారు. మద్యం షాపులు ఏర్పాటు చేసి తమ జీవితాలను నాశనం చేయవద్దంటూ వారు రోడ్డుపై బైఠాయించారు. మాకు మద్యం షాపు వద్దు అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.