గుంటూరు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ నెల 28వ తేదీన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. ఉదయం 9: 30 నుంచి 10: 30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 0863-2224202 నంబర్ కు ఫోన్ చేసి స్థానిక సమస్యల గురించి తెలియ చేయవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.