గుంటూరు నగరపాలక పాలక సంస్థ కౌన్సిల్లో శుక్రవారం కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ చిత్ర పటంతో నిరసన చేశారు. జోహార్ అంబేడ్కర్ అంటూ నినదించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో మేము ఇక్కడ కౌన్సిల్లో ఉన్నామంటూ అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.