గుంటూరు నగరంలో ఎస్కార్ట్ బందోబస్త్ విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ శుక్రవారం విధి నిర్వహణలో ఉండగా గన్ మిస్ ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీనివాసు ను హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సహచర సిబ్బంది తరలించినప్పటికీ శ్రీనివాస్ ను పరిశీలించిన డాక్టర్ అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు తెలిపారు. మిస్ ఫైర్ ఎలా జరిగిందనే పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.