గుంటూరు జిల్లా కార్యాలయంలో శనివారం పోలీస్, జువైనల్ పోలీస్ యూనిట్స్, బాలల సంక్షేమ అధికారులకు బాలల హక్కులపై శిక్షణా కార్యక్రమం జరిగింది. క్యాలెండర్ యాక్టివిటీస్ లో భాగంగా జిల్లా జడ్జి పార్ధసారధి ఆధ్వర్యంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి. లీలావతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ గుంటూరు డి. వి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.