గుంటూరు: దీపక్ హత్య కేసులో ఏడుగురు నిందితులు అరెస్ట్

65చూసినవారు
గుంటూరు: దీపక్ హత్య కేసులో ఏడుగురు నిందితులు అరెస్ట్
గుంటూరు బాలాజీనగర్లో మద్యం మత్తులో స్నేహితులు దాడి చేయడంతో మరణించిన తెనాలి యువకుడు దీపక్ కేసును పాత గుంటూరు పోలీసులు చేధించారు. ఈ మేరకు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. మృతిచెందిన దీపక్ తన స్నేహితుడు కిరణ్ కుమార్ కు తెలియకుండా ఫోన్ పే నుంచి రూ. 53 వేలు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడన్నారు. డబ్బులు తిరిగి చెల్లించక పోవడంతో మద్యం తాగించి దాడి చేయడంతో దీపక్ మృతి చెందాడని సీఐ సోమయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్