అధికారిక కార్యక్రమాలు, శిలాఫకాల ఏర్పాటులో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై శనివారం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొటోకాల్ పాటించక పోవటంపై జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. గ్రామాల్లో తమకు తెలియకుండా అభివృద్ధి పనులు మంజూరు చేసి, ఇప్పుడు తమ ఆమోదం కోసం సమావేశంలో ప్రశేపెట్టటం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.