స్పీకర్ కోడెలతో లగడపాటి రాజగోపాల్‌ భేటి

1677చూసినవారు
స్పీకర్ కోడెలతో లగడపాటి రాజగోపాల్‌ భేటి
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం భేటీ అయ్యారని సమాచారం. గుంటూరు నగరంలోని చుట్టుగంట సెంటర్‌లో గల ఓ హోండా షోరూమ్‌లో వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారని సమాచారం. కాగా కోడెల-లగడపాటి భేటీపై అంతటా ఆసక్తి నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరపడం పట్ల పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్