ఉండవల్లి, తక్కెళ్లపాడు ప్లాంట్లలో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో ఆదివారం గుంటూరు నగరంలో పాక్షికంగా తాగునీటి సరఫరా జరుగుతుందని జీఎంసీ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర రావు తెలిపారు. రెండో శనివారం నేపథ్యంలో ప్లాంట్ల వద్ద విద్యుత్ శాఖ పనులు చేసిందని, ఈ నేపథ్యంలో రిజర్వాయర్లకు నీటి సరఫరా జరగలేదని చెప్పారు. నీటి సరఫరాకు పాక్షిక అంతరాయం ఏర్పడుతుందన్న విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.