గులాబి రంగు పురుగును నియంత్రించుకోవడానికి ఎకరానికి కనీసం ఎనిమిది చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని గుంటూరు ఏరువాక కేంద్రం సమన్వయకర్త డా.ఎన్ వెంకటలక్ష్మి తెలిపారు. మేరికపూడి గ్రామంలో వ్యవసాయ శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పురుగులు, తెగుళ్ల నియంత్రణ, పోషక యాజమాన్యం తదితర అంశాలపై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వాసంతి, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు గ్రామ రైతులు పాల్గొన్నారు.