ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ కమిటీమెంబర్ గా గుండాల రాకేష్

488చూసినవారు
ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ కమిటీమెంబర్ గా గుండాల రాకేష్
ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా శ్రీశ్రీ కళావేదిక పల్నాడు జిల్లా జనరల్ సెక్రెటరీ గుండాల రాకేష్ ( నరసరావుపేట ) నియమితులయ్యారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. "అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ " _శ్రీశ్రీ కళావేదిక మరియు చేజర్ల ఇంద్రాణి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 9, 10 తేదీల్లో తిరుపతి మహతి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కవులు, కళాకారుల ప్రోత్సాహం కొరకు ప్రపంచ కవితోత్సవం - సాహిత్య సదస్సులు - కళా ప్రదర్శనలు - పుస్తకావిష్కరణలు తదితర సాహిత్య, సాంస్కృతిక కార్య క్రమాల ద్వారా ప్రపంచ సాహితీ, కళా చరిత్రలో ఈ బ్రహ్మోత్సవాలు వరల్డ్ రికార్డును కైవసం చేసుకోనున్నాయి. ఉత్తర్వులు అందుకున్న రాకేష్ మాట్లాడుతూ "తనను ప్రపంచ సాహితీ బ్రహ్మోత్సవాల ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యునిగా నియమించిన ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్కి ధన్యవాదాలు తెలుపుతూ, విజయవంతంగా కార్యక్రమ నిర్వహణకు పునరంకిత మవుతానని "అన్నారు. పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పట్టణస్తులు పలువురు రాకేష్ ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్