గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం తాడికొండ మండలం వెలగపూడి సచివాలయంలో ప్రవేశ పెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. బీసీ సంక్షేమానికి రూ. 39, 007 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక సహాయంతో సాంప్రదాయ వృత్తుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.