చంద్రబాబు నాయుడు మహిళల కోసం దీపావళి పండుగను పురస్కరించుకొని ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని నిలబెట్టుకున్నారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మాధవి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళల కోసం టీడీపీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మేరకు ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.