గుంటూరు: విద్యార్థిని మృతిపై బాధిత కుటుంబం ఆందోళన

52చూసినవారు
గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెంలో 8వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ వద్దకు చేరుకొని యాజమాన్యంపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్కూల్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ చిన్నారి మృతికి కారణం చెప్పాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై నల్లపాడు పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్