గుంటూరు: ఆక్రమణలు తొలగించి డ్రైన్లను విస్తరిస్తాం

65చూసినవారు
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం 49వ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. శారదా కాలనీలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైన్ల విస్తరణ వల్ల తాము ఇళ్లు కోల్పోతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రజలకు ప్రత్యామ్నాయం చూపిన అనంతరమే ఆక్రమణలు తొలగించి, డ్రైన్లను విస్తరిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్