గుంటూరు జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి 'ఐక్యత పరుగు' (రన్ ఫర్ యూనిటీ) నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ బుధవారం తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ ఐక్యత పరుగులో పాల్గొనవచ్చునని ఎస్పీ సూచించారు. 'ప్రతి ఒక్కరూ సమానులే' అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.