శ్రీరెడ్డి పై గుంటూరులో కేసు నమోదు
శ్రీ రెడ్డిపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో శనివారం కేసు నమోదైంది. శ్రీరెడ్డి నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్, తదితరులపై అసభ్యకరంగా మాట్లాడారని గుంటూరు పశ్చిమ నియోజక వర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు, దాసరి జ్యోతి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.