
కేసానుపల్లిలో భారీ కొండచిలువ కలకలం
దాచేపల్లి మండలం కేసానుపల్లిలో సోమవారం 10 అడుగుల పొడవైన కొండచిలువ ఏకంగా ఒకరి ఇంట్లో కనిపించింది. దీంతో గ్రామస్తులు కొండచిలువను చూసి భయాందళనకు గురై చంపేశారు. స్థానిక అటవీ ప్రాంతం నుంచి కొండ చిలువ వచ్చిందని తరచూ పాములు, చిన్న చిన్న విషపూరిత పురుగులు, కీటకాలు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. విషపురుగులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.