
గురజాల: బీసీలు రాజ్యాధికారం సాధించాలి: వెంగలరావు
పల్నాడు జిల్లా గురజాల పట్టణం నందు ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగలరావు, అతిధులు గా ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణ మోహన్ ముదిరాజ్ పాల్గొన్నారు. వెంగలరావు మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం సాధించే విధంగా చైతన్యం రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు