పిడుగురాళ్ల పట్టణంలో డయేరియా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పిడుగురాళ్ల నుంచి సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు పేషెంట్లు చికిత్సకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి, 11 మంది డయేరియా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. వారికి సరైన వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.