ఆధునిక డ్రోన్ టెక్నాలజీతో అక్రమ చర్యలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు దాచేపల్లి సీఐ భాస్కర్ తెలిపారు. సోమవారం దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో సీఐ డ్రోన్ ఎగురవేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్బంగా శాంతి భద్రతలు కాపాడటంలో కీలక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూదం, కోడి పందాలు, గంజా అక్రమ కార్యకలాపాలను నియంత్రించేందుకు డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తున్నామన్నారు.