విత్తనాల షాపులలో తనిఖీలు

63చూసినవారు
విత్తనాల షాపులలో తనిఖీలు
దాచేపల్లి మండలంలోని విత్తన షాపులను శుక్రవారం ఏడీఏ రవికుమార్, స్థానిక వ్యవసాయ అధికారి పాపకుమారి తనిఖీ చేశారు. వివిధ విత్తన షాపులలో స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్, సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్లు, స్టాక్ నిల్వలను పరిశీలించారు. సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్స్ లేకుండా డీలర్లు ఎవరూ విత్తనాలు అమ్మవద్దని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్