గురజాల మండలం దైద శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో చోరీ జరిగినట్లు ఆలయ అర్చకుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హుండీలో ఉన్న డబ్బును దొంగిలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూజారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.