దాచేపల్లి పట్టణంలోని ఇరికేపల్లి రోడ్డు వద్ద ఆదివారం రాత్రి బైక్ ను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాచేపల్లికి చెందిన కొండలు అనే వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైవేపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.