సాగర్ కాల్వలో పడి వ్యక్తి మృతి
ఈపూరు మండలం ఇనుమెళ్లకు చెందిన కాసా రామకోటయ్య(62) ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడి మృతి చెందాడు. రామకోటయ్య గురువారం కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కాల్వ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాల్వలో గల్లంతయ్యాడు. శుక్రవారం శవమై తేలుతూ కనిపించాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమామశ్వరరావు తెలిపారు.