ఈపూరు మండలం ఎస్సై యండీ ఫిరోజ్ శనివారం దాచేపల్లికి బదిలీ అయ్యారు. ఎన్నికలకు ముందు ఈపూరు మండల ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో మండలంలోఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈయన స్థానంలో ఏం. ఉమామహేశ్వరరావును ఈపూరుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.