ఈపూరు: సామాజిక తనిఖీలలో పలు అక్రమాలు గుర్తింపు
ఈపూరు మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం సామాజిక తనిఖీలో భాగంగా ప్రజా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డ్వామా పిడి లింగమూర్తి మాట్లాడుతూ.. కూలీలకు 100 శాతం పని కల్పించి జీవనోపాధి చూపించడమే ఉపాధి హామీ పథకం లక్ష్యమని ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించ వలసిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ఈ ప్రజా వేదికలో రూ 95, 790 రూపాయలు రికవరీ ఆదేశించినట్లు డ్రామా పీడీ సిద్ధి లింగమూర్తి పేర్కొన్నారు.