ఇటీవల న్యాయవ్యవస్థలోని పలు చట్టాలు మార్పులు జరిగాయని, వాటిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రెంటచింతల మండలం ఐసిడిఎస్ సూపర్వైజర్ వై శ్రీదేవి గురువారం అన్నారు. గురువారం మండల పరిధిలో మిట్టగుడిపాడు గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో మిషన్ శక్తి భారతీయ న్యాయ సంహిత అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కొరకు చట్టంలో మార్పులు జరిగాయని వారు అన్నారు.