పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో గురువారం రాత్రి శ్రీ భగవాన్ గీతా యజ్ఞం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి రెండవ తారీఖున మాచర్లలో జరగబోయే శ్రీ భగవాన్ గీతా యజ్ఞం కార్యక్రమం ఆహ్వానానికి ప్రతి గ్రామంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల వరకు గ్రామంలోని పెద్దల సహకారంతో నిర్వహించగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.