పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోషించిన ఆకు రౌడీలకు శిక్షపడేలా చర్యలు చేపడతామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కారంపూడి పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు అంటూ అయన అన్నారు.