మాచర్ల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బుధవారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ పర్వదినాన ప్రజలందరూ కుటుంబ సమేతంగా సుఖ, సంతోషాలతో క్షేమంగా ఉండాలని దైవాన్ని ప్రార్థించారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు పడ్డ కష్టాలు తొలగి దీపావళితో పురోగతి సాధించాలన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగను ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలన్నారు.