మాచర్ల ఎక్సైజ్ పోలీస్టేషన్ పరిధిలో వైన్ షాపుల నిర్వాహకులు ఎమ్మార్పీ ధరల కంటే అధిక రేట్లు అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాచర్ల కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ ఎవరైనా ఎమ్మార్పీ ధరలకు మించి అధికంగా విక్రయాలు జరిపితే సమాచారం అందించాలన్నారు. ఎమ్మార్పీలను మించి అదనంగా ఒక రూపాయి కూడా వసూలు చేయరాదని హెచ్చరించారు.