రెంటచింతల మండల పరిధిలోని మంచికల్లు లో పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు ఆదివారం పర్యటించారు. పోలేరమ్మ తిరుణాలలో కలెక్టర్ అరుణ్ బాబు , ఎస్పీ కంచి శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కలెక్టర్ ను అధికారులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.