యువతకు ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడక గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమలు చేసిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. సామాజిక పెన్షన్లను పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని అన్నారు.